మందారం తో ఒత్తైన జుట్టు మీ సొంతం.. ఇలా వాడితే బెటర్..

పెరిగిన కాలుష్యం, మారిన ఆహరపు అలవాట్లు వల్ల జుట్టు రాలి పోవడం నానాటికీ పెరిగి పోతుంది..ఎన్ని రకాల మందులను వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. అలా నిరాశ లో ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. మన ఇంట్లో ఉండే మందారం తో జుట్టు రాలే సమస్యల నుంచి బయట పడవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. ఆలస్యం లేకుండా మందారం ను ఎలా వాడాలో తెలుసుకుందాం..

జుట్టు పొడిబారడం, బట్టతల, స్లీపింగ్ ఫోలికల్స్, గ్రే హెయిర్, జుట్టును మృదువుగా చేస్తుంది. అయితే, దీన్ని జుట్టుకు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి..

మందారం, పెరుగు:

పెరుగు జుట్టును శుభ్రం చేస్తుంది. అలాగే మందారం కుదుల్లను బలంగా చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

ఎలా చేయాలంటే..
ఒక పువ్వు, 5 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. మామూలుగానే పేస్ట్‌లా చేసి హెయిర్‌ మాస్క్‌లా అప్లై చేసుకోవాలి.. బాగా ఆరిన తర్వాత మైల్ద్ షాంపు తో తల స్నానం చేయాలి..

మందారం నూనె:

8 మందార పువ్వులు, 1 కప్పు సేంద్రీయ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ మందార రేకులను కడిగి ఆరబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. కొబ్బరి నూనెను వేడి చేసి, మందారం పేస్ట్ వేసి రెండు నిమిషాలు మళ్లీ వేడి చేయాలి.. ఈ నూనె ను చల్లార్చి బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.. తల స్నానం చేసి అరగంట ముందు కుదుళ్లకు రాసుకొని స్నానం చేస్తె జుట్టు బాగా పెరుగుతుంది..

మందారం, పుదీన,మందారం మెంతులు లను కూడా వాడితే మంచి ఫలితం ఉంటుంది.. చుండ్రు సమస్యలు తగ్గి నల్లని, ఒత్తైన జుట్టు ను మీ సొంతం చేసుకోవచ్చు..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.