ఈ ఆకులతో హెయిర్ ప్యాక్ వేస్తే ఎన్ని లాభాలో..

manaarogyam

పెరుగుతున్న కాలుష్యాలు, మారుతున్న ఆహరపు అలవాట్ల కారణంగా జుట్టు ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నెన్నో ప్రయథ్నాలు చెస్తున్నారు. అవి ఫలించక నిరాశ చెందుతారు.మందారం ఆకులతో అధ్బుతమైన ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..ముందుగా మందారం ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి పేస్టులా తయారు చేసుకోవాలి. మందారం ఆకుల మిశ్రమంలో కొద్దిగా కలబంద వేసి కలపాలి. తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి.

తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. దానితోపాటు జుట్టు ఊడిపోకుండా, రాలిపోకుండా, జుట్టు చివర్ల చిట్లిపోకుండా చూస్తుంది. నిర్జీవంగా ఉన్న జుట్టును రిపేర్ చేసి సక్రమంగా పెరిగేలా చేస్తుంది. కేశ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.. ఇదే కాకుండా మందారం ఆకుల పేస్ట్ లో పెరుగు వేసి జుట్టుకు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment