కొందరి ఇళ్లల్లో ఎప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చినా తమ ఫ్యామిలీ డాక్టన్ ను కన్సల్ట్ అవుతారు. ఆయన ఇచ్చిన సలహాలు, మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఫ్యామిలీ డాక్టర్ ఉన్న ప్రతి ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తొందరగా నయం అవుతాయని భావిస్తారు. అలాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ డాక్టర్ అవసరం లేదని ఆరోగ్యనిపుణలు అంటున్నారు దాదాపు అన్ని ఇళ్లల్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిరోజూ తులసికి పూజ చేసిన తరువాతే మిగతా పనులు చేస్తారు. తులసి మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరలో శంకరుడు ఉంటారని అంటారు. అందుకే ప్రతీ దేవాలయంలో తులసి తీర్థం పెడుతూ ఉంటారు. అయితే ఈ తులసి ఆకుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
మన ఆరోగ్యకర జీవనానికి తులసి ఆకులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. తులసి ఆకులు తినడం వల్ల నోటి పూత, నోట్లో అల్సర్లు వంటి సమస్యలు తగ్గిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు తులసి కాషాయం తాగిస్తే నయం అవుతుంది. దంత సమస్యలతో బాధపడేవారు సైతం తులసి ఆకుల పొడితో శుభ్రం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. తులసి పేస్టు చేసుకోవడం ద్వారా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నోటి నుంచి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది.

జ్వరాల బారిన పడేవారు తులసి కాషాయాన్ని తాగాలని చెబుతున్నారు. జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు తులసి ఆకుల్లో యాలకుల పొడిని అరలీటర్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ కాషాయాన్ని తాగాలి. ఈ కాషాయంలో తేనె, పాలు కలిపి తీసుకుంటే జ్వరం తీవ్రత తగ్గే అవకాశం ఉంది. బ్రొంకైటిస్, అస్తమాతో బాధపడుతున్న వారికి ఈ కాషాయం మంచి ఔషధంలా పనిచేస్తుంది. చిన్నపిల్లలు తులసి ఆకులు నమిలడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం రాకుండా ఉంటుంది.
తులసి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి. ఇక తులసి ఆకులు మెత్తగా నూరి మొహానికి రాసుకుంటే చర్మ సమస్యలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. తులసి రసంలో తెనెను కలిసి తీసుకోవడం వల్ల పైత్యం తగ్గుతుంది. అలాగే మూత్ర విజర్జన సమయంలో మంటతో బాధపడేవారు. తులసి ఆకుల రసంలో పాలు, చక్కెర కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. తులసి మొక్క సువాసన ఘాటుగా ఉంటుంది. ఇంట్లో ఈ ఆకులను ఉంచితే దోమలు రాకుండా అడ్డుకోవచ్చు.