చిన్న రోగం వచ్చిన కూడా డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్తారు..వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తారు. అంత దూరం వెళ్ళే బదులు మన వంటింటి లో ఉండే పోపుల డబ్బాలో ఉండే వాటితో ఎన్నో రొగాలను నయం చేయచ్చు.. ఎటువంటి వాటితో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
యాలకులు :
ఊపిరితిత్తుల్లో గాలిప్రసరణను పెంచి శ్వాసవ్యవస్థకు సహాయపడతాయి.వీటిలో వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆల్కలాయిడ్లు, ప్లవోనాయిడ్లతో పాటూ క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి.. నోటి సమస్యలకు ఈ యాలకులు మంచి మెడిసిన్..
పసుపు:
దీనిలోని కర్క్యుమిన్ అనే రసాయనం వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సహజ పెయిన్‌కిల్లర్‌గా, రక్తంలో గ్లూకోజ్, కొవ్వుల స్థాయిని నియంత్రించేందుకు సహకరిస్తుంది. శ్వాసకోశం సవ్యంగా పనిచేయడానికి దోహదపడుతుంది.. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఈ పసుపును ఎక్కువగా ఉపయొగిస్తారు.
జీలకర్ర :
నిమోనియా నివారిణిగా ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలతో పాటు విటమిన్-సి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.. బరువును అదుపులో ఉంచడం తో పాటుగా చలికాలంలో వచ్చే అనారొగ్య సమస్యలను దూరం చేస్తుంది..
లవంగాలు,మిరియాలు,దనియాలు ఇవన్నీ కూడా ఎన్నో అనారొగ్య సమస్యల నుంచి దూరం చేస్తాయి..