మొటిమలు, మచ్చలకు ఆ నూనెతో చెక్ పెట్టండి..

manaarogyam

మహిళలకు యుక్త వయస్సు వస్తే ముఖం పై మచ్చలు,మొటిమలు బాధ పెడతాయి. ఆ సమస్యల నుంచి బయట పడటానికి ఎన్నో రకాల క్రీములను, ఆయుర్వేద మందులను వాడుతుంటారు. అయిన వాటి నుంచి విముక్తి లేకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకుంటారు. అలాంటి వారికి అదిరిపొయె గుడ్ న్యూస్.ఆవ నూనె తో వాటికి చెక్ పెట్టవచ్చు అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు..మరి ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ఆవనూనెలో విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.ఒక బౌల్‌లో కొద్దిగా ఆవనూనె, శనగపిండి, కొద్దిగా నిమ్మరసం తీసుకుని.. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అలానే ఒక ఇరవై నిమిషాలు వదిలెయ్యండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మొటిమలు, మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి..కేవలం అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఈ నూనె మంచి ఔషధం.. మీకు ఈ సమస్యలు ఉంటే మీరు కూడా ఒకసారి వాడి చూడండి..

Leave a Comment