జుట్టు బాగా పెరగాలంటే ఇలా తప్పక చేయాలి..

manaarogyam

Updated on:

అమ్మాయిలకు జుట్టు అందంగా, ఒత్తుగా పెరగాలని అందరికి కొరికగా ఉంటుంది. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏవి కూడా అనుకున్న ఫలితాలు ఉండవు.. అయితే జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇంట్లో దొరికే వాటిని ఉపయొగించితే మెలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది తలస్నానము చేసే ముందు తలను దువ్వుకోరు. దాని వల్ల జుట్టు ఎక్కువగా ఊడి పోయే ప్రమాదం ఉంది. ఎలా అంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎక్కువగా చిక్కులు పడుతుంది.

అది ఆరాక దువ్వుకుంటే జుట్టు ఎక్కువగా ఊడే ప్రమాదం ఉంది. చాలా మంది జుట్టు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో అతి జాగ్రత్తతో ప్రతి రోజు తలస్నానము చేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా చేయటం వలన తలలోని సహజమైన నూనెలు పోయి జుట్టు కళ లేక జీవం కోల్పోతుంది. అందువల్ల తలస్నానము అనేది రెండు రోజులకు ఒకసారి చేస్తే సరిపోతుంది.తడి తలను హెయిర్ డ్రైయర్ తో ఆరబెట్టకుండా పొడి టవల్ తో తుడిస్తే మంచిది. అదే పనిగా టవల్ తో బలంగా తుడిస్తే జుట్టు చిట్లిపోయే ప్రమాదం ఉంది.

Leave a Comment