శనగపిండి తో ఇదొక్కటి కలిపి రాస్తే నిగారింపు చర్మం మీ సొంతం..

manaarogyam

Updated on:

శనగపిండి న్యాచురల్ స్క్రబ్ ముఖం పై పెరుకుపొయిన మలినాలను, మృత కణాలను తొలగించి మృదువైన అందమైన చర్మాన్ని అందిస్తుంది.అంతేకాదు చర్మం పై ఉన్న నలుపును వెంటనే పోగొడుతుంది. ఈ శనగ పిండి లో మరికొన్ని పదార్థాలను వాడితే మంచి ఫలితం ఉంటుంది.. అదేమిటో పూర్తి వివరాల తో తెలుసుకుందాం…

శనగపిండి, గోధుమపిండి,పసుపు,పెరుగు. ఇవి మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. గోధుమపిండి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి మృదువుగా,కాంతివంతంగా చేయటానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే పోషకాలు,యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంపై బ్యాక్టీరియాను తొలగించి మొటిమలు,నల్లని మచ్చల సమస్యలను వెంటనే తగ్గిస్తుంది.. పెరుగు చర్మాన్ని మృదువుగా, తెల్లగా మారుస్తుంది.

ఈ ఫ్యాక్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోని అందులో స్పూన్ శనగ పిండి, అర స్పూన్ గోధుమ పిండి,పెరుగు వేసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి కొంచెం సేపు చేతి వేళ్ళ సాయంతో మసాజ్ చేసి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ఫ్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. మీకు నచ్చితే మీరు ట్రై చెయ్యండి

Leave a Comment