ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..

manaarogyam

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలను తప్పక పాటించాలి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్ధాలను తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.. అలా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు.. అవేమీటో ఇప్పుడు చూద్దాం..

తేనే..

వాతావరణ మార్పులు జరిగినప్పుడు బాడీకి బలమైన ఇమ్యూనిటీ అవసరమవుతుంది. అలాంటి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్‌లో ఒకటి తేనె. పరగడుపున, కొద్దిగా గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..గుండె జబ్బులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.నాచురల్ ఎనర్జీ బూస్టర్ గా పని చేస్తుంది.. చర్మ సమస్యలు తగ్గిస్తుంది.. బరువు తగ్గదానికి చాలా మంచి మెడిసిన్..అందాన్ని కూడా రెట్టింపు చేయడంలో ఈ తేనే మంచిది.

ఉసిరి కాయలు..

ఉసిరి మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది.. ముఖ్యంగా గుండె జబ్బుల నుండి, కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది..బరువు తగ్గడం లో సహాయం చేస్తుంది.అరుగుదలకి సహకరిస్తుంది.మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది.హెమోగ్లోబిన్ స్థాయిలని పెంచుతుంది. డీటాక్స్ చేస్తుంది. ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ ని ప్రెవ్నెట్ చేస్తుంది, జరిగిన డ్యామేజ్ ని రిపెయిర్ చేస్తుంది.కంటి చూపుని మెరుగుపరుస్తుంది.. జుట్టు పెరగడం లో ఈ ఉసిరి సహాయపడతాయి.

వెల్లుల్లి..

వంటిళ్ళలో తప్పని సరిగా ఉండే వస్తువుల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లిని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పరగడుపునే గోరు వెచ్చని నీటితో రెండు రెబ్బలు తీసుకుంటే చాలా మంచిది..శరీరంలోని మలినాలను బయటకి పంపేస్తుంది.డయాబెటీస్, డిప్రెషన్ సమస్యల నుంచి కాపాడుతుంది. చుసారుగా తక్కువ ఖర్చుతో ఎన్నో రోగాలు నయం అవుతున్నాయో
మీకు ఈ టిప్స్ నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment