చలికాలంలో ఈ వేడి వేడి సూప్ తాగితే అద్బుతాలే..

manaarogyam

చలికాలం వచ్చిందంటే జనాలకు రోగాల భయం పట్టుకుంటుంది. సీజన్ వ్యాధులు ఎక్కువగా ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇటువంటి రోగాల తో పోరాటానికి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం.. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వెచ్చదనాన్ని కలిగించే దుస్తులు వేసుకోవాలి.వేడిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం ఉత్తమం..

గొంతు సమస్యల నుంచి బయట పడాలంటే మాత్రం సూప్ తాగా ల్సిందే అంటున్నారు.. మరి సూప్ తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..సూప్ లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. సూప్ మన శరీరానికి కావాలిసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.వేడి వేడిగా ఒక కప్పు సూప్ తాగితే నీరసం తగ్గి పోతుంది. ఒత్తిడి చికాకు చిరాకుగా అనిపిస్తుంది అయితే వెంటనే వేడి వేడి సూప్ సిప్ చేయండి.. మెదడుని తేలిక పరుస్తుంది. వేడి వేడిగా సూప్ తాగితే వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితమై చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. సూప్ లో కూరగాయల తో పాటుగా మిరియాలు, అల్లం, శొంఠి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.. అప్పుడే జలుబు దగ్గు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Leave a Comment