చలికాలంలో లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

manaarogyam

చలికాలం వచ్చిందంటే రోగాలు కూడా వచ్చినట్లే.. చల్లదనానికి క్రిములు వేగంగా మానవ శరీరం పై దాడి చేస్తాయి.వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఊపిరితిత్తులపై ఎటాక్ చేసి వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి.అందుకే ఈ కాలంలో లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం..

ఈ సీజన్‌లో రోజుకో ఒక కప్పు త్రిఫల టీని తీసుకుంటే గనుక ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారడంతో పాటుగా శ్వాస సంబంధిత సమస్యలు సైతం పరార్.అంతేకాదు చలిని తట్టుకొనే శక్తీ కూడా వస్తుందని అంటున్నారు.ప్రతి రోజు ఉదయాన్నే గ్లాస్ గోరు వెచ్చని నీటితో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మ రసం యాడ్ చేసుకుని సేవించాలి.ఇకపోతే శ్వాస సంబంధిత వ్యాయామాలు అంటే యొగాలు చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

ధూమపానం చేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఈ చలి కాలంలో మానుకోవాలి. జంక్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం మానుకోవాలి.ఆయిల్ ఫుడ్స్ కాకుండా తాజా పండ్లు, కూరగాయలు,ఆకు కూరలు తినడం ఉత్తమం.. అప్పుడే మన ఆయుస్షు పది కాలలు చల్లగా ఉంటుంది.

Leave a Comment