సలాడ్ లను ఎప్పుడు తీసుకుంటే మంచిదంటే..?

manaarogyam

బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయథ్నాలు చేస్తుంటారు..అందులో భాగంగా అన్నం తినడం తగ్గించి పండ్లు, కూరగాయల తో చేసిన సలాడ్ లను ఎక్కువగా తీసుకుంటున్నారు..సలాడ్స్ ఆరోగ్యానికి మంచిదని మరియు బరువు తగ్గుతారని భోజనంతో పాటు కొంతమంది తీసుకుంటూ ఉంటారు..

ఈ సలాడ్ లను భోజనం చేసే అరగంట ముందు లేదా తర్వాత తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పొషక విలువలు అందుతాయని నిపుణులు అంటున్నారు. సలాడ్స్ అనేవి చల్లగా ఉంటాయి మరియు భోజనం కొంచెం వెచ్చగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండింటినీ కలిపి తింటామో జీర్ణవ్యవస్థకు చాలా ఒత్తిడి కలుగుతుంది.అందుకే
సలాడ్స్ ను సరైన విధంగా తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. దాంతో పాటుగా జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది మరియు ఆరోగ్యంగా ఉంటుంది. సలాడ్స్ ను తినడం వల్ల కొవ్వు ఏర్పడడాన్ని తగ్గిస్తుంది..పండ్లు, కూరగాయలే కదా అని మోతాదుకు మించి తినకూడదు..అప్పుడే ఆరోగ్యం, అందం మీ సొంతం..

Leave a Comment