నీళ్లల్లో వుండే మట్టిని తొలగించి, నీటిని శుభ్రం చేయానికి ‘స్పటిక’ అనేదాన్ని వాడుతారని పూర్వం రోజుల నుండి తెలిసిన విషయమే. ఆ స్పటిక అసలు ఎందుకు మట్టిని తొలగించి నీటిని శుద్ధి చేస్తుంది. త్రాగే నీటిలో మట్టిని తొలగించి నీటిని శుద్ధి చేసుకొని మరి తాగొచ్చా? దాని వలన అసలు ఏం లాభం ఉందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ స్పటిక అనేది అల్యూమినియం సల్పైట్. ఈ అల్యూమినియం అయన్స్ నీళ్లలోని మట్టి అణువులని పట్టేసుకుంటాయి. మట్టి అణువులు అల్యూమినియం కి పట్టుకునేసరికి, మట్టి అణువులు బరువు ఎక్కిపోతాయి. అలానే ఆ బరువు కారణంగా కిందకి వెళ్లిపోతాయి. నీళ్లలోని మట్టి అణువులను క్రిందకి తీసుకుపోతుంది అల్యూమినియం సల్ఫేట్ ముఖ్యంగా అల్యూమినియం అయన్స్ అనడం జరుగుతుంది. దీనివల్ల పైన అంత కూడ మంచి వాటర్ ఉంటది అలానే, అడుగునకు మట్టి అణువులు అనేవి వెళ్లిపోతాయి.
ఇలా నీళ్లలో వుండే మట్టి అణువులని మనకి తెలియకుండా త్రాగేస్తుంటాం. వీటిలో కొన్ని మన హెల్త్ పాడుచేసేవి ఉంటాయి కనుక, త్రాగే నీటిలో మట్టి అణువులని తొలగించి త్రాగితే మంచిది.
పూర్వం రోజుల నుండి చూస్తే, కాలువల్లో, బావుల్లో, చెరువుల్లో నీరు తెచుకునేవాళ్ళు. బావుల్లో నీరు అడుగంటినపుడు చూస్తే, మట్టి అణువులు అనేవి మనకి కన్పిస్తుంటాయి. ఇలా కాలువలలో, బావుల్లో, చెరువుల్లో నీరు తెచ్చి స్నానంకి వాడిన కొంత మట్టి అనేది కూడ పడుతుండేది. ఇలాంటి మట్టి అణువులని తొలగించానికి పూర్వము రోజుల్లో కొంత మంది తెల్సి పట్టికను వాడితే మరికొంత మంది తెలియకుండ వాడేవారు. ఈ రోజుల్లో కూడ బావుల నుండి, చెరువుల నుండి, బోరుబావుల నుండి కానీ నీళ్లు తెచ్చుకునే వాళ్ళు, పట్టికతో నీరు శుద్ధి చేసుకొని వాడుకోవటం మంచిది. పట్టికను నీళ్లలో వేయటం వాళ్ళ నీళ్లలోని మట్టి అణువులు అనేవి అల్యూమినియం అయాన్లు పట్టుకోవటం వాళ్ళ బరువుతో నీళ్ల అడుగు భాగంకి చేరుతాయి.
స్పటికను నీటిలో ఎంత వాడాలి?
డ్రింకింగ్ వాటర్ లో మనం వాడొచ్చు. స్నానం కి వాడే నీళ్లలో వాడొచ్చు. కొంచెం ఎక్కువ అయినా సరే స్నానం నీళ్లలో వేసి, శుద్ధి అయినా నీళ్లను స్నానం కి వాడొచ్చు.
స్పటిక వలన లాభాలు:
నీటిలో వుండే బ్యాక్టీరియాని ఈ అల్యూమినియం సల్ఫేట్ చంపేస్తుంది అని సైన్స్ చెప్తుంది.
నీళ్లలో వుండే రేడియేషన్ ఎఫెక్ట్ అనగా UV ఎఫెక్ట్ కానీ, లేసర్ ఎఫెక్ట్స్ కానీ, నీటి నుండి తొలగించానికి కూడ ఈ పట్టికలోని అల్యూమినియం సల్ఫేట్ అయాన్లు ఉపయోగపడతాయి.
అల్యూమినియం సల్ఫేట్ ని వాక్సిన్ తయారీలో కూడ ఉపయోగిస్తున్నారు. అలానే వాక్సిన్ ఎక్కువ రోజులు పని చేయానికి ఈ అల్యూమినియం సల్ఫేట్ దోహదపడుతుంది.
ఎలా వాడాలి?
1 లీటర్ నీళ్లలో 85 మిల్లి గ్రాము చొప్పున స్పటిక వేసేస్తే సరిపోతుంది. డ్రింకింగ్ వాటర్ లో అయితే 10 నుండి 15 మిల్లీగ్రాము వరకు స్పటికను వేసుకోవాలి.
ఉదాహరణ: 5 లీటర్ లా నీరు తాగాలనుకుంటే, దీనిలో 50 మిల్లీగ్రాము వరకు స్పటిక వేయాలి. అలానే 10 నుండి 15 నిముషాలు ఉండాలి. ఇలా చేస్తే పైన అంత కూడ స్వచ్ఛమైన నీరు అనేది ఉంటది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడ ఏమి వుండవు.
ఈ స్పటిక ఖరీదు అనేది ఒక కిలో 150 నుండి 200 ఉంటది.
నీరు అనేది జీవనాధారం, ప్రాణాధారం. అలాంటి నీటిలో బ్యాక్టీరియా ఉంటే వ్యాధులు అనేవి వస్తుంటాయి. కాబట్టి నీటిలోని మట్టి అణువులని తొలగించి, వీలైనంత వరకు శుద్ధి అయినా వాటర్ ని తీసుకోవాలి.