సాంబార్ ఇడ్లీ తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలరు..

manaarogyam

ఇడ్లీ అంటే చాలా మందికి ఇష్టం.. లైట్ ఫుడ్, హెల్త్ కు చాలా మంచిది కూడా.అయితే ఇడ్లీ చట్ని కాకుండా ఇడ్లి సాంబార్ తీసుకోవడం వల్ల మంచి రుచి తో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.. ఇక ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం..

సాంబార్ ఇడ్లీలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మనిషికి కావాల్సిన ప్రొటీన్లు, ఫైబర్లు ఇందులో లభ్యమౌతాయి. సాంబారు తయారీలో పచ్చి బఠాణిలు, అలసందలు, బీన్సు, పొటాటో, క్యారెట్, సొరకాయ లతో పాటుగా సీజన్ లో దొరికే అన్ని కూరగాయలను వాడుతుంటారు..ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో మునగకాయలు వాడితో అందులోని కాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది. ఇకపోతే కాస్త స్వీట్ నెస్ కోసం బెల్లం ను వేస్తారు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

సాదారణంగా సాంబార్ తయారి లో చింతపండు రసం కలుపుతారు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఐరన్, థయామిన్, మాగ్నిషీయం, పోటాషీయంలు సంవృద్దిగా లభ్యమౌతాయి. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగని రోజు అదేపనిగా సాంబార్ ఇడ్లీ తీసుకోవటం ఏమంత మంచిది కాదు.. వారంలో కనీసం రెండు లేదా మూడుసార్లు తింటే మంచిదని నిపుణులు అంటున్నారు… ఇప్పటి నుంచైనా సాంబార్ ఇడ్లీ తినడం అలవాటు చేసుకుంటే మరీ మంచిది..

Leave a Comment