Chapati : రాత్రిపూట చపాతీలు తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

manaarogyam

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు బరువు సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకునేందుకు వ్యాయామంతో పాటు అనేక రకాల మెడిసిన్ వాడుతున్నారు. ఈ క్రమంలో ఆహారాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. అయితే చాలా మంది వైద్యులు ఒకపూట అన్నం తిని.. రాత్రి పూట చపాతీలు తినమని సలహా ఇస్తున్నారు. చాలా మంది వైద్యుల సలహా మేరకు చపాతీలను తింటూ ఉన్నారు. అయితే చపాతీలు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం లేదు. ఇవి పాటించకపోతే మీరు చపాతీలు తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదని కొందరు హెచ్చరిస్తున్నారు. మరి రాత్రిపూట భోజనానికి బదులు చపాతీలు తినేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనితో బిజీగా మారుతారు. పొద్దున ఖర్చయ్యే కేలరీలు రాత్రి పడుకున్న తరువాత కావు. అందువల్ల ఉదయం అన్నం తిన్నా త్వరగా జీర్ణమవుతుంది. కానీ రాత్రి పూట మాత్రం త్వరగా జీర్ణం కాకుండా శరీరంలో కొవ్వులాగా తయారై పేరుకుపోతుంది. దీని వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అయితే అధిక బరువు పెరిగిన వారు ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ క్రమంలో వైద్యులను సంప్రదిస్తారు. వైద్యుులు సూచించే వాటిలో మొదటిది రాత్రి లైట్ ఫుడ్ తీసుకోమనడం. ఇందులో అన్నం కంటే చపాతీలు తినాలని చెబుతారు.

చపాతీల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రాత్రి పూట కేలరీలు తక్కువగా ఖర్చవుతాయి. కాబట్టి రాత్రి పూట చపాతీలు తినడం వల్ల ఎలాంటి కొవ్వు పేరుకుపోదు. కానీ ఇదే సమయంలో అధిక శక్తినిస్తుంది. గోధుమల్లో ఎక్కువగా వితమిన్ బి, ఈ, కాపర్, అయొడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అందువల్ల వైద్యులు ఎక్కువగా వీటికే ప్రిఫరెన్స్ ఇస్తారు.

ఇక వైద్యులు ఎలాగూ చపాతీలు తినమన్నారు కదా..అని ఎలా పడితే అలా తింటే ప్రయోజనం ఉండదు. ముందుగా చపాతీలు ఎక్కువగా నూనె లేకుండా కాల్చుకునే ప్రయత్నం చేయాలి. నూనె మొత్తానికి లేకుంటే ఇంకా బెటర్. ఇవే కాకుండా చపాతీలు రుచిగా లేకున్నా కొందరు అన్నంతో సమానంగా తింటారు. అంటే కనీసం మూడు నుంచి నాలుగు చపాతీలను మాత్రమే తీసుకోవాలి. కొందరు ఇదే అదనుగా ప్లేట్ నిండా చపాతీలు తింటారు. ఇలా తినడం వల్ల బరువు తగ్గడం అటుంచి..కొత్త రోగాలు మొదలవుతాయి. అందువల్ల మోతాదులో మాత్రమే చపాతీలు తీసుకోవాలి.

Leave a Comment