Curd Rice : రాత్రి పూట పెరుగన్నం తింటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి

Curd Rice : పెరుగు తింటే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పాల ఉండి త‌యార‌య్యే ప‌దార్థాల్లో పెరుగు ఒక‌టి. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. పెరుగులో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. కాబ‌ట్టి పాలు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు పెరుగునైనా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఈ బ్యాక్టీరియా ఎంతో మంచిది. ప్ర‌స్తుతం ఉన్న ఆహార‌పు అల‌వాట్ల మంచి బ్యాక్టీరియాను కోల్పోతున్నాం. క‌నుక మంచి బ్యాక్టీరియా పుష్క‌లంగా ల‌భించే పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. కాబ‌ట్టి రోజూవారి ఆహారంలో పెరుగును త‌ప్ప‌కుండా తీసుకోవాలి. కొంద‌రు రాత్రిపూట పెరుగును తిన‌కూడ‌ద‌దు అని అంటారు. కానీ రాత్రిపూట కూడా పెరుగును నిర‌భ్యంత‌రంగా తిన‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

అయితే జలుబు, ద‌గ్గు, అల‌ర్జీల‌తో బాధ‌ప‌డే వారు మాత్రం రాత్రిపూట పెరుగును తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని వారు చెబుతున్నారు. పెరుగు క‌ఫానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని జ‌లుబు, ద‌గ్గు వంటి వాటితో బాధ‌ప‌డే వారు రాత్రిపూట పెరుగు తీసుకోకూడ‌ద‌ని ఆయుర్వేదం చెబుతుంది. ద‌గ్గు, జ‌లుబుల‌తో బాధ‌ప‌డే వారు రాత్రిపూట పెరుగు తీసుకోవ‌డం వ‌ల్ల శ్లేష్మం వృద్ధి చెందుతుంది. ఒక‌వేళ పెరుగు తీసుకోకుండా ఉండ‌లేని ప‌క్షంలో ప‌లుచ‌టి మజ్జిగ‌ను తీసుకోవ‌చ్చు. ఈ మ‌జ్జిగ‌లో చిటికెడు ఉప్పు, చిటికెడు జీల‌క‌ర్ర పొడిని వేసి క‌లిపి తాగితే మ‌రింత మేలు క‌లుగుతుంది.

ప‌గ‌టి పెరుగును తినే వారు దానిలో పంచ‌దార కలుపుకోకండా తినాలి.రాత్రి పూట పెరుగు తినే వారు అందులో పంచ‌దార లేదా మిరియాల పొడి కలుపుకుని తాగ‌డం వ‌ల్ల పొట్ట‌కు హాయిగా ఉంటుంది. పొర‌పాటున కూడా పెరుగును వేడి చేసి తీసుకోకూడ‌దు. వేస‌వి కాలంలో అయితే పెరుగ‌న్నం తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. పెరుగులో పంచ‌దార వేసి ల‌స్సీలాగా చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు. అంతేకాకుండా పెరుగులో ట‌మాట ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి పెరుగు చ‌ట్నీ చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. మ‌జ్జిగ చారు చేసుకుని తిన‌డం ఎండాకాలం శ్రేయ‌స్క‌రం. ఎండాకాలంలో పెర‌గ‌న్నం తింటే శ‌రీరానికి వ‌చ్చే చ‌ల్ల‌ద‌న‌మే వేరు. మ‌న జీర్ణ‌క్రియ‌ను పెరుగు సాఫీగా ఉంచుతుంది. అలాగే గ‌ట్టి పెరుగును అస‌లు తీసుకోకూడ‌దు. పెరుగులో కొద్దిగా నీటిని క‌లిపిన త‌రువాత మాత్ర‌మే పెరుగును ఆహారంగా తీసుకోవాలని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.