Kidneys : ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నాయని అర్థం.. !

మన శరీరంలో అతిముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇవి రక్తం శుద్ధి చేసిన తరువాత అందులో ఉండే మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియ చేయడానికి ఒక్కోసారి సమస్యను ఎదుర్కోవచ్చు. ఎవరికైతే ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదో వారి కిడ్నీలు సమస్యల్లో ఉన్నాయని తెలుసుకోవాలి. ఏ కారణం చేతనైనా ఒకసారి కిడ్నీలు అనారోగ్యానికి గురైనప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు మెడిసిన్ తీసుకోవాలి. అయితే అంతకుముందే మన కిడ్నీలు సమస్యలో ఉన్నట్లు కొన్ని లక్షణాలను భట్టి తెలుసుకోవచ్చు. ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చో ఇప్పుుడు చూద్దాం..

ఎర్ర రక్తకణాలు పెంచే ఎరిథ్రోప్రోయిటిన్ అనే హార్మోన్ ను కిడ్నీలు విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ విడుదల కావడం లేదంటే ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో ఎనిమియా (రక్త హీనత) ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లలో మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందదు. దీంతో వారికి ఎలాటి పనిచేయాలన్న ఉత్సాహం ఉండదు. బద్ధకం ఏర్పడి దేని మీద సరైన దృష్టి ఉండదు. ఈ లక్షణాలు ఉన్నవారిలో కిడ్నీలు సమస్యల్లో ఉన్నాయని గుర్తించవచ్చు.

కొందరికి అతిగా మూత్రం వస్తుంది.. మరికొందరికి అసలు మూత్రం రాదు. ఒక వేళ మూత్ర విసర్జన సరిగా ఉన్నా మంటగా వస్తుంది. మొకాళ్లు, కీళ్లు ఉబ్బిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇవన్నీ కిడ్నీలు సమస్యల్లో ఉంటే కనిపించే లక్షణాలే. అలాగే కిడ్నీలు ఉండే చుట్టుపక్కన నొప్పిగా ఉండడం,ఆహారం పదార్థాలు తింటే వాటి రుచి కోల్పోవడం వంటివి కూడా కిడ్నీ సంబంధిత లక్షణాలుగానే చెప్పవచ్చు.

కిడ్నీ వ్యాధుల బారిన పడితే వెన్నులో నొప్పి తీవ్రంగా ఉంటుంది. వెన్ను భాగం కింది వరకు నొప్పి ఉంటుంది. తరుచుగా దురద రావడం, మంటలు పుడుతూ ఉంటాయి. రక్తంలో మలినం కావడంతో చర్మం పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలున్నా కిడ్నీ సమస్యలే అని గుర్తించాలి. పై లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే కిడ్నీ సమస్యలేనని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే ఎక్కువగా నీరు తాగడం వల్ల ఈ సమస్య తీవ్రం కాకుండా ఉండే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.