ప్రకృతి ప్రసాదించిన జీలకర్ర మనం ప్రతి వంటకంలోను వినియోగిస్తుంటాము. అలాంటి జీలకర్ర జీర్ణక్రియని బాగా మెరుగు చేస్తుంది అని మన అందరికి తెల్సిన విషయమే! జీలకర్రలో థైమల్ అనే కెమికల్ ఉంటది. ఇది ఆహార పదార్ధాలు త్వరగా జీర్ణం అవ్వనికి లైపేస్, ఎమేలైస్ & ప్రొటియైస్ పైత్య రసంని ఇలాంటి జీర్ణ రసాలను బాగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
జీలకర్రని ఉపయోగించటం వల్ల ముఖ్యంగా బాడీలోని కొవ్వు కరగటానికి దోహదపడుతుంది అని సైంటిస్ట్ లు వెల్లడించారు. జీలకర్రలోని thymoquinone అనేది మాములుగా మనం exercise చేసినపుడు మనలో మెటబాలిజం increase అవుతుంది. కొవ్వు బర్న్ అయిపోయి, energy గా ఖర్చు అయిపోతుంది. కొంత మంది వ్యాయామాలు చేయలేరు. కొన్ని ఆహార నియమాలు ద్వారా తగ్గుతాం మాకి ఉద్యోగ వ్యాపారాలున్నాయని అంటుంటారు. వీరిలో మెటబాలిజం స్లోడౌన్ అయితే వారిలో కొవ్వు పేరుకుపోతుంది. అలానే బరువు కూడ పెరిగిపోతుంటారు. మెటబాలిజం బాగా increase అయితే ఫ్యాట్ బర్న్ బాగా జరుగుతుంది.
జీలకర్రలోని thymoquinone అనేది మన లివర్ ని ఆక్టివేట్ చేస్తుంది. లివర్ ద్వారా మన బాడీలోని మెటబాలిజం ని స్పీడ్ అప్ చేస్తుంది. కొవ్వు తగ్గనికి జీలకర్ర బాగా దోహదపడుతుంది. మాములుగా కొవ్వులొ కొవ్వుకణాలు పేరుకొని ఉంటాయి. ఎలా పేరుకున్న కొవ్వు కూడ ఆ కొవ్వు కణాల నుండి inflammation వస్తుంది. ఈ inflammation మనకి చాలా ఇబ్బంది కల్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టన్స్ వచ్చి షుగర్ వచ్చే ఛాన్స్ వుంది.
ఒక 8 వరాల పాటు, రోజుకి రెండు గ్రాములు మనము జీలకర్రని గనుక ఉపయోగించినట్లు అయితే LDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని స్పష్టంగా నిరూపించడం జరిగింది. ముఖ్యంగా కొవ్వుని కరిగించానికి, ఫ్యాట్ సెల్స్ లో inflammation ని తగ్గించానికి, గుండె పోటుకు కారణం అయ్యే LDL కొలెస్ట్రాల్ ని తగ్గించానికి జీలకర్ర ఉపయోగపడుతుంది. వీటికోసం జీలకర్ర లేదా జీలకర్ర మరిగించిన నీళ్లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది.
2011లో Indian Institute of Integrative Medicine (IIIM) జీలకర్ర వాటర్ మీద పరిశోధనలు చేసారు. రక్తంలోని చక్కర అనేది కణంలోనికి త్వరగా వెళ్ళుటకు జీలకర్ర వాటర్ లోని thymoquinone దోహదపడుతుంది. జీలకర్రలో యాంటి ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బాడీలో inflammation రాకుండ బాగా ఉపయోగపడుతుంది. మాములుగా మనం జీలకర్రని తాలింపులో వేస్తాం. ఇలా చేయటం వల్ల 200 నుండి 250 హీట్ లో యాంటీ ఆక్సిడెంట్లు damage అవుతాయి. తద్వారా బెనిఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. ఇలాకాకుండా జీలకర్ర నీళ్లు త్రాగటం వాళ్ళ damage అనేది లేకుండా డైరెక్టుగా వెళ్తాయి.
జీలకర్రని రెండు లేదా మూడు గంటలు నానబెట్టుకోండి. నానబెట్టిన జీలకర్రని మరిగించండి. వేడి చేసిన జీలకర్ర ని ఫిల్టర్ చేసి మిగిలిన వాటర్ ని త్రాగితే చాలా మంచిది. ఇలా చేయటం ద్వారా డయాబెటిస్ రాకుండా నివారించడానికి దోహదపడుతుంది. జీలకర్ర తినటం కంటే కూడ జీలకర్ర వాటర్ త్రాగటం మూలాన చాలా లాభాలు అనేవి వున్నాయి.