నోటి పూత సమస్య కొందరిని బాగా బాధిస్తుంది. దీని నుంచి బయట పడటానికి ఎన్నెన్నో చెస్తున్నారు. అయనా కొన్ని సార్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంటి చిట్కాలను ఉపయొగించి ఆ సమస్యను దూరం చేయవచ్చు .. ఎలానో చూద్దాం..
నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తీసుకున్న వెంటనే నోటిలో నీళ్ళు పోసుకొని పుక్కిలించాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నోటి పూత రావటానికి ఐరన్ లోపం కూడా ఒక కారణం. అందువలన ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. నువ్వులు, కిడ్నీ బీన్స్, గుమ్మడి కాయ విత్తనాలు, ఎండుద్రాక్ష, డాట్ చాక్లెట్స్, ఓట్స్, వేరుశెనగ గింజలు ను తరచూ తీసుకోవాలి. పాలు, పెరుగు, పనీర్ మీ డైట్ లో భాగం చేసుకోవాలి.
బీన్స్ ఉత్పత్తులలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది అందువలన వీటిని తరచూ తీసుకోండి. బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్ ను ఎక్కువగా తినాలి. ఇక ఆకుకూరల విషయానికి వస్తే తోటకూర, పుదీనా, పాలకూర లో కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బ్రోకలీ, క్యాలీఫ్లవర్, బెండకాయ, క్యాప్సికం, బీట్రూట్ కూరగాయలను తరచూ తీసుకుంటూ ఉండాలి. బొప్పాయి, నారింజ, అవకాడో, అరటి పండ్లు తీసుకోవాలి. ఇవి కాకుండా నాన్ వెజ్ కూడా తీసుకోవడం మంచిది.