Joints Pains Juice : మొకాళ్లు, కీళ్ల నొప్పులకు ఈ జ్యూస్ వరం..: ఎలా తయారు చేసుకోవాలంటే..?

manaarogyam

వాతావరణ కాలుష్యంతో పాటు మనం తినే ఆహారం నేటి రోజుల్లో కల్తీగా మారుతోంది. దీంతో సరైన భోజనం చేయలేక రోగ నిరోధక శక్తి కోల్పోతున్నాం. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాం. పూర్వకాలంలో పెద్దలు అనేక ఆయుర్వేద చిట్కాలు పాటించడం వల్ల వయసు మీద పడినా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. కానీ ఈ కాలంలో 30 ఏళ్లు దాటని వారికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నారు. అలా వచ్చిన వాటిల్లో మొకాళ్ల నొప్పులు ప్రత్యేకంగా చెప్పవచ్చు. నేటి చాలా మంది యువతలో మొకాళ్ల నొప్పుులతో బాధపడుతున్నారు. కొందరు మెడిసిన్ వాడుతున్నారు. అయినా ఇవి తగ్గడం లేదు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మొకాళ్ల నొప్పులతో బాధపడే ఎవరైనా ఈ జ్యూస్ ను రోజూ గ్లాస్ తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగాన ఆ పదార్థాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మార్కెట్లోకి వెళితే అన్నీ అందుబాటులో ఉంటాయి. అందువల్ల మనకు కావాల్సిన పదార్థాలను మార్కెట్లోకి వెళ్లి తీసుకొచ్చి.. ఆ తరువాత జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ తయారు చేయడానికి దాల్చిన చెక్క, పైనాపిల్, నీరు, ఆరెంజ్ జ్యూస్, తేనె తో పాటు తగినంత ఓట్స్ తెచ్చుకోవాలి.

ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకొని ఓట్స్ ను వేసి ఉడికించాలి. ఇవి ఉడికిన తరువాత ఆ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చాలి. ఆ తరువాత దాల్చిన చెక్క, పైనాపిల్, ఆరెంజ్ జ్యూస్, తేనెను నీటిలో వేసి కలపాలి. అందులో మరింత నీరు అవసరం అసుకుంటే కలపొచ్చు. ఆ తరువాత దానిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ తరువాత ఓట్స్ మిశ్రమం వేసి మరోసారి గ్రైండింగ్ చేయాలి. మొత్తం జ్యూస్ లా మారుతుంది.

ఆ తరువాత వచ్చిన జ్యూస్ ను తాగేయాలి. ఇలా రోజూ తాగడం వల్ల ఇప్పటికే మొకాళ్లతో బాధపడిన వారికి ఉపశమనం అవుతుంది. ఈ జ్యూస్ లో యాంటి ఇన్ ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో కీళ్లు మొకాళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి. అలాగే ఇందులో సీ విటమిన్, మెగ్నిషియంలు కూడా అధికంగా లభిస్తాయి. దీంతో ఈ జ్యూస్ తాగడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. అలా మొకాళ్ల వరకు రక్తప్రసరణ జరిగి అక్కడుండే నొప్పులు మాయం అవుతాయి.

Leave a Comment