ఈ కాలంలో జీడిపప్పు ను ఎందుకు తినకూడదో తెలుసా..?

manaarogyam

జీడిపప్పును తినడం వల్ల ఏన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే..అయితే ఇన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్న ఈ పప్పులను చలికాలంలో అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు.ఎందుకు తినకూడదు.. ఏదైనా సమస్యలు వస్తాయా అనే విషయాలను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శరీరానికి కావలసిన అన్ని పోషకాలను జీడిపప్పు నుండి పొందవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒలిక్‌ ఆసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.. అంతే కాదు రక్త హీనత తో బాధ పడే వారికి ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు జీడిపప్పు తినవద్దు. అలాగే విరేచనాలు, గ్యాస్, అజీర్ణం సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు జీడిపప్పును తినడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు..జీడిపప్పు తినడం ద్వారా తలనొప్పి సమస్య కావచ్చు. ఇందులో టైరమైన్, ఫైనిలేథైలమైన్ అనే అమైనో ఆమ్లాలు ఉంటాయి.అందుకే ఈ కాలంలో వీటికి దూరంగా ఉండటమే మేలు..

Leave a Comment