ఈ టీ ని తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..

manaarogyam

టీ అనేది ఇప్పుడు అందరి జీవితంలో భాగం అయ్యింది. కొన్ని రకాల టీ లను తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అందులో ఒకటి కశ్మీరీ కహ్వా టీ.. అందుకు కావలసిన పదార్థాలు, తయారి విధానం ఒకసారి చూద్దాం..

కావాలసిన పదార్థాలు..

నీళ్లు- 2 కప్పులు,
దాల్చిన చెక్క- రెండు,
యాలకులు- రెండు,
లవంగాలు- రెండు,
గులాబీ రేకులు – అయిదు,
చక్కెర – రెండు స్పూన్లు,
గ్రీన్‌ టీ ఆకులు- స్పూను,
బాదం పప్పు – నాలుగు,
కుంకుమ పువ్వు – 10

తయారీ విధానం..

ముందుగా సుగంధ ద్రవ్యాలన్నిటినీ పొడి చేసుకోవాలి.టీ గిన్నెలో నీళ్లు వేసి ఉడికించాలి. ఇందులో కాస్త పొడిని, గులాబీ రేకుల్ని, చక్కెరని కలపాలి. బాగా మరిగాక స్టవ్‌ కట్టేయాలి. దీంట్లోనే గ్రీన్‌ టీ ఆకులు వేసి మూతపెట్టాలి. మూడు నిమిషాల తరవాత ఈ ద్రవాన్ని వడగడితే వేడి వేడి కశ్మీరీ కహ్వా టీ రెడీ… వేడి వేడి గా తాగితే చాలా మంచిది..

Leave a Comment