నిమ్మకాయ,కాఫీతో అందమైన ముఖం మీ సొంతం..

నలుగురిలో అందంగా కనిపించాలని అమ్మాయిలు వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ కు వెళతారు.. కానీ అవి కొద్ది రోజులు మెరుపులే..ఇంట్లో దొరికే వాటితో ఇలా ఒకసారి చేస్తె చాలా తొందరగా మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. ఈ చిట్కా కు నిమ్మకాయ,కాఫీ పొడిని ఉపయోగిస్తారు.ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, అరస్పూన్ కలబంద జెల్, అరస్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి.. అలా వారానికి రెండు,మూడు సార్లు చేస్తె ముఖం పై పెరుకుపొయిన మలినాలను పొగొడుతుంది. చర్మం మరింత అందంగా మారుతుంది.

నిమ్మ లో వుండే సహజ గుణాలు ముఖాన్ని తెల్లగా మారుస్తుంది. అలోవెరా జెల్ చర్మాన్ని డీప్ గా క్లిన్ చేసి చర్మ రంద్రాలు మినిమైజ్ చేస్తుంది. తాన్,ముడతలను తొలగిస్తుంది. కాఫీ పొడి చర్మంలో డల్ మరియు డ్రై ప్యాచ్ లను తొలగిస్తుంది.రోజ్ వాటర్ చర్మానికి రంగును అందిస్తుంది.

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.