పేలు పోవాలంటే ఈ చిట్కా పాటించాలి సుమీ..

manaarogyam

చాలా మందికి మహిళకు,పురుషులకు పేల సమస్య ఉంటుంది.ఈ పేలు ఉండటం వల్ల తలలో దురదలు,పుండ్లు,జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.. ఆ పేలు పూర్తిగా పోవడానికి ఎన్నెన్నో మందులను వాడతారు.. అవి కొద్ది రోజులు బాగానే ఉంటాయి. తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది.ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

ఒక బౌల్ లో ఐదు కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేయాలి. అర చెక్క నిమ్మరసం పిండాలి.ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. కర్పూరం, నిమ్మరసం,కొబ్బరి నూనె బాగా కలిసేలా బాగా కలపాలి.ఆ నూనెను తలకు మాడుకు పట్టించి అరగంట ఆగి తక్కువ షాంపు తో స్నానం చేయాలి. తడి మీద దువ్వితే మొత్తం పోతాయి. ఇలా వారానికి ఒకసారి చేస్తె ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది

Leave a Comment