చలికాలంలో చర్మం పొడి బారుతుంది. పెదాలు కూడా చలికి ఇలాగే పగుళ్లు రావడం జరుగుతుంది..చిన్నా పెద్దా అని తేడా లేకుంటే ఆందరూ ఈ సమస్య తో బాధపడుతున్నారు. పొడిగాలి వంటి కారణాల వల్ల పెదవులు పగిలిపోయి అందవిహీనంగా మారతాయి. దాంతో ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఏం చేయాలో అర్థంగాక తెగ సతమతమైపోతుంటారు.
ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని ఇంటి చిట్కాలను ట్రై చేయాల్సిందే.. అదేమిటో తెలుసుకుందాం..
ఒక బౌల్‌లో ఒక స్పూన్ కీర దోస రసం, ఒక స్పూన్ వెన్న వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.. ఈ రసాన్ని పడుకోవడానికి రెండు ,మూడు గంటల ముందు మూడు సార్లు అప్లై చేస్తె ఉదయానికి మృదువైన పెదాలను సొంతం చేసుకోవచ్చు..
మరో చిట్కా..బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆలోవెర జెల్, రెండు పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. రాత్రి నిద్ర పోయే ముందు ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి ఉదయాన్నే చల్లని నీటితో కడిగేయాలి.. ఇలా చేసిన మంచి ఫలితం ఉంటుంది..