లీచి పండ్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి..ఇవి చూడటానికి స్ట్రాబెర్రీలు మాదిరిగా ఉంటాయి.వీటిలో శరీరానికి కావలసిన అన్నీ రకాల పొషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.. బాగా పండిన లిచ్చి పండ్లను రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ముఖ్యంగా గుండె జబ్బులు దరి చేరకుండా చేస్తాయి. ఈ పండులో సోడియం, కొలెస్ట్రాల్ ఉండదు. దాంతో గుండె జబ్బులు, రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ వ్యాధులను తగ్గిస్తుంది.సి విటమిన్ ఎక్కువగా ఉండటంతో చర్మ సమస్యలను దూరం చేస్తాయి.డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి3 ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ వ్యవస్థను నియంత్రిస్తుంది..జీర్ణ వ్యవస్థ పనితీరును ప్రోత్సహిస్తుంది.. బరువును తగ్గించు కొవాలని అనుకునేవారికి ఈ పండు బెస్ట్.. రోజూ డైట్ లో వీటిని తీసుకోవచ్చు..