Rice : ఈ పద్ధతిలో వండిన అన్నం తింటే షుగర్ రాదట..!

manaarogyam

కాలం మారుతున్న కొద్దీ పాశ్చాత్య సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో మనుషులు చేసే చాలా పనులు మిషన్లు చేస్తున్నాయి. దీంతో మనుషులకు శారీరక శ్రమ తక్కువవతుంది. ఫలితంగా శరీరానికి అసవరమైన వ్యాయామం లభించక అనేక వ్యాధులు అంటుతున్నాయి. ఒకవైపు శారీరక శ్రమ లేకుండా ఆనారోగ్యాల బారిన పడితే.. మరోవైపు మనం తినే తిండిలోనూ ఎన్నో లోపాలు ఉండి వ్యాధులు సంక్రమిస్తున్నాయి.

ఎన్ని పదార్థాలు తిన్నా.. అన్నానికి మించి భోజనం ఉండదు. రోజులో ఒక్కసారైనా అన్నం తినకపోతే కడుపు నిండినట్లవదు. అయితే ఈరోజుల్లో చాలా మంది అన్నం వండే పద్ధతిని మార్చేశారు. బియ్యం తెల్లగా ఉండాలని అనేక రకాల పాలిష్ చేస్తున్నారు. దీంతో అందులో ఉండే పోషకాలన్నీ మాయమవుతున్నాయి. అయితే ఈ పద్ధతి ద్వారా అన్నం వండితే మళ్లీ మనం పోషకాలను శరీరానికి అందించినట్లవుతుంది.. మరి ఏ పద్ధతిలో అన్నం వండాలి..? అనేది తెలుసుకుందాం..

ఎప్పటిలాగే బియ్యాన్ని మంచినీటితో కడుక్కోవాలి. ఆ తరువాత వంట్లలో వాడే కొబ్బరినూనెను మూడు శాతం వెయ్యాలి. అంటే ఒక కిలో బియ్యానికి 30 గ్రాముల కొబ్బరి నూనెను వేసి ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత అన్నాన్ని వెంటనే ఫ్రిజ్ లో పెట్టాలి. ఒక గంటపాటు అందులో ఉంచాలి. ఆ తరువాత దానిని బయటకు తీసి వెంటనే తినాలి. ఇలా చేయడం వల్ల అన్నంలో రెసిస్టెంట్ స్టాక్స్ పిండి పదార్థంగా మారుతుంది. ఇలా పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. అందులో ఏమాత్రం కొవ్వు ఉండదు.

ఇప్పుడున్న వారిలో సగానికంటే ఎక్కువ మందిలో షుగర్, బీపీలు ఉన్నాయి. షుగర్ ఉన్నవాళ్లు అన్నం తక్కువ తింటారు. అయితే పై పద్ధతిలో వండిన అన్నాన్ని షుగర్ ఉన్నవాళ్లు తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలో ఉంచేలా ఈ అన్నం తోడ్పడుతుంది. షుగర్ కూడా అదుపులోకి వస్తుంది. మాములు అన్నం తినడం కంటే ఇలాంటి అన్నాన్ని తినడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఈ పద్ధతిలో వండిన అన్నం చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. కానీ శరీరంలో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment