వేడి వేడి ఆహారాన్ని తీసుకుంటున్నారా?

manaarogyam

ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా వేడిగా వుండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. ఆహారం చల్లగా వున్నప్పుడు తింటే అందులో వైరస్ లు చేరే ప్రమాదం ఉంది. అందుకే వేడి పదర్థాలను తీసుకోవడం చాలా మంచిది. అలాగని బాగా వేడిగా వుండే వాటిని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

మరీ వేడి వేడిగా ఉండే ఫుడ్స్ తింటే మాత్రం సమస్యలను ఏరి కోరి తెచ్చు కున్నట్టే అవుతుంది. అవును, బాగా వేడిగా ఉండే ఆహారాలను తీసుకుంటే అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ సమస్యలు ఏంటీ..? ఎందుకు మనల్ని ఇబ్బంది పెడతాయి. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పొత్తి కడుపు లోపల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందు వల్ల వేడి వేడిగా పొగలు కక్కే ఫుడ్స్‌ను తింటే పొత్తి కడుపు లోపల చర్మం దెబ్బ తింటుంది.

ఫలితంగా కడుపు నొప్పి, కడుపు మంట వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అలాగే వేడి వేడి ఆహారాలను తినడం వల్ల టేస్ట్ బడ్స్‌ దెబ్బ తింటాయి.అలా వేడిగా తీసుకోవడం వల్ల నాలుక, చర్మం తో పాటుగా రుచి కూడా కోల్పోతారు. అంతేకాదు పండ్లు కూడా పాడు అవుతాయి. జాగ్రత్త సుమీ..

Leave a Comment