మైదా పిండితో చేసిన వంటలను అతి తింటే?

manaarogyam

Updated on:

ఈరోజు స్వీట్ అంటే దాంట్లో తప్పనిసరిగా మైదా పిండి పడాల్సిందే.పిండిని వంటలలో ఎక్కువగా వాడితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.గోధుమ పిండిని బాగా ప్రాసెస్ చేసి మైదా పిండిని తయారు చేస్తారు. కనుక మైదాపిండి గోధుమపిండి కంటే తెల్లగా ఉంటుంది. మైదా పిండిలో పోషకాలు విలువలు  శూన్యం. మైదాపిండి జిగురు తత్వాన్ని కలిగి ఉంటుంది.

మైదాతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే పేగులకు అతుక్కుపోయి బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ లు కలిగే ప్రమాదం వుంటుంది.మైదా పిండిలో ఎటువంటి ప్రోటీన్లు ఉండవు. ఈ పిండిని తక్కువగా ఉపయోగించడమే మంచిది. మైదాకు బదులుగా గోధుమపిండిని ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజూ మైదాతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. జాగ్రత్త సుమీ..

Leave a Comment