ఒకవైపు వర్షం.. మరోవైపు చలి వల్ల జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్క్కొవాల్సి వస్తుంది.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తో పాటుగా అందాన్ని మెరుగుపరచడానికి కష్టపడవలసి వస్తుంది.ఈ సీజన్ లో ఎక్కువగా చర్మం తరచూ పొడిబారడం, మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలు బాధించవచ్చును.ఇటువంటి సమస్యలను అధిగమించాలంటే బంతి పూలను వాడాలి..

ఇక ఆలస్యం ఎందుకు ఈ పూల తో అందాన్ని ఎలా మెరుగుపరచాలి అనేది తెలుసుకుందాం..బంతిపూల రేకలను తీసుకుని వాటర్‌తో వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించాలి.నీళ్ళను వదపొసి కొద్దిగా తేనేను వేసుకోవాలి.దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి..ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి అనంతరం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే డ్రై స్కిన్ మృదువుగా, కోమలంగా మారుతుంది. మరియు చర్మ ఛాయ కూడా పెరుగుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తె ముఖ పై మచ్చలు పోయి,అందంగా తయరవుతుంది
