మెరిసే చర్మం కోసం మిల్క్ పేస్ మాస్క్..

manaarogyam

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఎన్నెన్నో కలలు కంటారు.. అందుకోసం కనిపించిన వాటిని రాస్తుంటారు.మార్కెట్‌లో లభించే క్రీములను వాడే బదులు కొన్ని ఇంటి చిట్కాలను వాడటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.పాలను వివిధ రకాల సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలను మాత్రమే చర్మ సంరక్షణగా వాడటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు..

చర్మ సౌందర్యానికి కావలసినవి పాలల్లొ సమృద్ధిగా ఉంటాయి.. డార్క్ స్పాట్స్, డ్రై స్కిన్ సమస్యలను పాలు తగ్గి స్థాయి.ఇక పాల తో పేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావాలసిన పదార్థాలు..

పావు కప్పు పాలు

రెండు స్పూన్లు చాక్లెట్ పొడి

పాలు చర్మానికి రంగును తీసుకురావడంతో మృదువుగా మారుస్తాయి.

చాక్లెట్ పొడి చర్మంలోని అన్ని రకాల మలినాలను శుభ్రపరుస్తుంది. చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని కాంతివంతంగా, అందంగా ఉంచుతుంది.

తయారి విధానం..

ఒక కప్పు తీసుకొని అందులో పాలు తీసుకొని చాక్లెట్ పొడి వేసి బాగా కలపాలి..ఆ మిస్రమాన్ని ఒక గంట ఫ్రిజ్ లో వుంచి తర్వాత పేస్ కు మసాజ్ చేయాలి.20 నిమిషాలు వుంచి కడిగేయాలి.. ఇలా వారానికి రెండుసార్లు చేస్తె నిగారించె చర్మం మీ సొంతం..

Leave a Comment