మునగాకు తో ఇలా చేస్తే పిల్లల ఆరోగ్యానికి మంచిది..

మునగాకు.. ములక్కాడల లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. పొషకాల పుట్టినిల్లు ఈ మునగ. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన వంటలను చేసుకొని తింటారు.. అందుకే వీటికి ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతుంది.మానవశరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి బ్యాక్టిరియాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. వీటిని ప్రతి రెండు రోజులకోసారి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది..మునగాకు తాలింపు, పప్పు చేసుకోవడం కామన్.. కొత్తగా పరాట చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కావలసినవి..

గోధుమ పిండి – ఒక కప్పు, మునగాకు – అరకప్పు, ఉల్లిపాయల తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను, ఉప్పు- మీ రుచికి తగినంత, వాము – టీస్పూను, నూనె -పరోటా కాల్చడానికి సరిపడా..

తయారీ..

ముందుగా మునగాకు ను శుభ్రంగా కడిగి, నీళ్ళు ఉప్పు వేసి ఉడికించాలి.. తర్వాత ఒక బౌల్ తీసుకుని గోధుమ పిండి తీసుకొని అందులో ఉడికించిన ఆకును వేసుకోవాలి..ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి, వాము అనీ వేసి బాగా కలపాలి. కలిపిన చపాతీ ముద్దను ఒక పక్కన పెట్టేయాలి. ఇరవై నిమిషాల తరువాత చిన్న ముద్దను తీసి పరోటాలా ఒత్తుకుని పెనంపై నూనె వేసి కాల్చాలి..అంతే ఎంతో రుచి కరమైన, ఆరోగ్య కరమైన డిస్ రెడీ.. పిల్లలు మాత్రం అస్సలు వదలకుండా తింటారు.. ఇలా మునగాకు ను వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిది.

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.