పెసలను తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

manaarogyam

Updated on:

పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో పొషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు..పెసలను రోజూ నీటిలో నానబెట్టి అనంతరం మొలకెత్తించి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. పెసలలో విటమిన్లు ఎ, బి, సి, ఇలు అధికంగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఐరన్‌, కాల్షియం, మెగ్నిషియం, కాపర్‌, ఫోలేట్‌, ఫైబర్‌లు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. అందువల్ల బరువు పెరుగుతామన్న భయం చెందాల్సిన అవసరం లేదు.

పెసలను

పైగా బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.పెసలను తినడం వల్ల ప్రోటీన్లు బాగా లభిస్తాయి. వీటితో శరీర నిర్మాణం జరుగుతుంది. కండరాల పనితీరు మెరుగు పడుతుంది. కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.పెసలను రోజూ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో పేగులు శుభ్రంగా మారుతాయి. తీవ్రమైన ఆకలి సమస్య ఉన్నవారు రోజూ పెసలను తింటే ఆకలి అదుపులోకి వస్తుంది. తద్వారా బరువు తగ్గడం తేలికవుతుంది.. ఇవి కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తున్నాయి..

Leave a Comment