పెసర పెండి తో ఎన్నో లాభాలు ఉన్నాయి.. చర్మం మరింత మెరవాలంటే ఈ పిండిని ఎక్కువగా వాడతారు.మొటిమలు,మొటిమల మచ్చలు,జిడ్డుని ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.ఇప్పుడు చెప్పే పాక్స్ ఉపయోగిస్తే చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు. వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.అరస్పూన్ పెసరపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత రబ్ చేసుకొని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖంపై ఫ్లాకీనెస్ తొలగిపోతుంది.

పెసలను ఉడికించాలి. ఒక స్పూన్ ఉడికించిన పెసలలో ఒక స్పూన్ తేనే వేసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద మొటిమలు మాయం అవుతాయి.ఒక స్పూన్ పెసరపిండిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద టాక్సిన్స్ తొలగిపోతాయి.అర స్పూన్ పెసరపిండిలో 2 స్పూన్ల కలబంద జెల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంచేసుకుంటే ముఖం తెల్లగా మారుతుంది..