నాన్ వెజ్ తినని వాళ్ళు పుట్ట గోడుగులను తింటారు. మంచి రుచితో పాటుగా మంచి ఆరోగ్యం కూడా ఉంది. అయితే వీటిని వారానికి ఒకసారి అయిన తింటే ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అసలు వీటిని తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయొజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక నివేదిక ప్రకారం పుట్టగొడుగులను తరచూ తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకే మానసిక ఆరోగ్యం కోసం వారానికి ఒక్కసారైనా తినమని ప్రోత్సహిస్తున్నారు ఆహారనిపుణులు.

వైట్ బటన్ మష్రూమ్‌లు, లయన్స్ మేన్ రకం పుట్టగొడుగులు అధికంగా తింటారు ప్రజలు. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను కలిగి ఉంటాయి. నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలతో పాటూ ఎర్గోథియోనినన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటి డిప్రెసెంట్లుగా పనిచేస్తాయి. చుసారుగా ఎన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో మీరు కూడా వీటిని తినడం అలవాటు చేసుకోవటం మేలు.