ఓట్స్ తో అందం పెంచుకోండిలా..

manaarogyam

ఓట్స్ తో ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓట్స్ ను డైట్ ఫుడ్ గా వాడుతున్నారు.. కేవలం ఆరోగ్యానికి మాత్రమే అందానికి కూడా ఓట్స్ ను ఉపయోగిస్తున్నారు. ఓట్స్ తో ఎలా అందాన్ని పెంచుకొవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..

ఒకకప్పు ఓట్స్​ని పొడి చేసి బకెట్ వేడినీళ్లలో కలపాలి. వాటిల్లో ఒక టీ స్పూన్​ రోజ్​ వాటర్​ కూడా వేయాలి. ఇరవై నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఓట్స్​లోని మాయిశ్చరైజింగ్, క్లెన్సింగ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ ప్రాపర్టీలు దుమ్ము, ధూళి వల్ల డ్యామేజ్​ అయిన స్కిన్​ని రిపేర్​ చేస్తాయి .
ఒక టేబుల్ స్పూన్​ పెరుగులో, ఒక టేబుల్ స్పూన్​ ఓట్స్​ పొడి, కొద్దిగా తేనె కలిపి ముఖానికి మసాజ్​ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంపై బ్లాక్​హెడ్స్​ పూర్తిగా పోతాయి. చర్మం మెరుస్తుంది కూడా. టమోటా జ్యుస్ , రోజ్ వాటర్, ఓట్స్ పొడి తో ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment