ఓట్స్ తో మంచురియా ట్రై చేశారా?

manaarogyam

ఓట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చెస్తాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేయాలనీ అనుకునేవారికి  ఓట్స్ మంచురియా ట్రై చేయడం మేలు. ఇక ఆలస్యం ఎందుకు ఆ రెసిపి తయారికి కావలసిన పదార్థాలు, తయారి విధానం ఇప్పుడు ఒకసారి చూద్దాం..

కావలసిన పదార్థాలు..

ఓట్స్‌- 150 గ్రా.,
ఉల్లిపాయ- ఒకటి ,
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు- చెంచా చొప్పున, క్యారెట్‌ తురుము- రెండు చెంచాలు,
సన్నగా తరిగిన క్యాబేజీ- పావు కప్పు,
మిరియాల పొడి- పావు చెంచా,
ఉప్పు- తగినంత,
టొమాటో, సోయాసాస్‌- పెద్ద చెంచా చొప్పున,
చిల్లీ సాస్‌- రెండు పెద్ద చెంచాలు,
టొమాటో కెచప్‌- మూడు పెద్ద చెంచాలు.

తయారీ విధానం..

ఓట్స్‌తో మొదలుపెట్టి ఉప్పు వరకు అన్ని పదార్థాలను ఒకదాని తర్వాత మరొకటి వేసి, చివరగా నీళ్లు పోసి బాగా కలిపి అయిదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత వీటిని లడ్డూల్లా చేసుకుని మరికాసేపు అలాగే పెట్టాలి. ఆ తర్వాత కాగే నూనెలో వేసి వేయించాలి. వీటి కోసం ప్రత్యేకంగా సాస్‌ తయారుచేసుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేసి వెల్లుల్లి తరుగు, పెద్దగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. దీనికి టొమాటో, సోయాసాస్‌, చిల్లీ సాస్‌, టొమాటో కెచప్‌లను వేసి మరోసారి బాగా కలపాలి. కొన్ని నీళ్లు పోసి కాస్త ఉడికించాలి. ఇందులో ఓట్స్‌ మంచూరియా బాల్స్‌ వేసి ఈ మిశ్రమం ఉండలకు పట్టేలా కలపాలి. గార్నిస్ కోసం ఉల్లి కాడలు, కొత్తిమీర తరుగు వేసుకుంటే సరి..

Leave a Comment