ఓట్స్.. ఇప్పుడు డైట్ లో వీటిని తీసుకుంటున్నారు.తక్కువ క్యాలరి లతో పాటుగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఓట్స్ తినడం వల్ల ఎక్కువ ఆకలి అనిపించదు..ఈ మధ్య ఓట్స్ తో వివిధ రకాల వంటలను తయారు చేస్తున్నారు.ఇప్పుడు ఓట్స్ తో పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం..
కావలసిన పదర్థాలు..
ఒక కప్పు ఓట్స్,
ముప్పావు కప్పు బొంబాయి రవ్వ ,
పావు కప్పు బియ్యప్పిండి,
ఒక కప్పు పుల్లటి పెరుగు,
రెండు పచ్చిమిరపకాయలు,
కొంచెం వంటసోడా,
రుచికి సరిపడా ఉప్పు,
తరిగిన కరివేపాకు,
ఒక స్పూన్ ఆవాలు,
ఒక స్పూన్ మినప్పప్పు,
ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పు,
కొత్తిమీర కొద్దిగా,
నూనె తగినంత
తయారి విధానం..
ముందుగా ఓట్స్ ను దొరగా వేయించుకోవాలి. తర్వాత
అదే కడాయిలో బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి. ఈ రెండు చల్లారాక మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి.ఈ పిండిని ఒక గిన్నె లోకి తీసుకోవాలి.అందులో తరిగిన పచ్చిమిర్చి, బియ్యప్పిండి, వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు పుల్లటి పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టి అందులో వేసి బాగా కలపాలి. పది నిమిషాలు పక్కన పెట్టి పొంగనాలు వేసుకోవాలి.. అంతే ఓట్స్ పొంగనాలు రెడీ..మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..