బయట ఎండ వేడి, కాలుష్యాల వల్ల చర్మం నుంచి జిడ్డు కారుతోంది.. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏ ఒక్కటి కూడా మంచి ఫలితాలను ఇవ్వలేవు. ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు.. ఎటువంటి వాటిని వాడితే మంచి ఫలితం ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని జీడిపప్పులను మెత్తని పొడిగా చేసుకొని దానిలో పచ్చి పాలను కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.
క్యారెట్ ముక్క, బీట్ రూట్ ముక్క,ఒక టమోటా,ఒక స్పూన్ బాదం పొడి మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ లో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు చర్మం బాధ తగ్గుతుంది.
బాదం పప్పులు,పచ్చి పాలు, రోజ్ వాటర్ వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీలో వేయాలి.. ఆ పేస్ట్ ను ముఖానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది.. పైన చెప్పిన ఫ్యాక్ లు అన్నీ కూడా జిడ్డు చర్మం నుంచి విముక్తి కలిగిస్తాయి.. మీరు కూడా ట్రై చేసి, ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది కామెంట్ చెయ్యండి..