Onion for Hair : ఊడిన జుట్టు ఉల్లితో సాధించొచ్చా..?

manaarogyam

ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని మనం విని వున్నాము. ఉల్లి మాత్రం జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య అందరికి జుట్టు ఊడిపోవటం ఎక్కువ అయింది. జుట్టు పల్చగా అవటం, జుట్టు కురులు పల్చగా అవ్వటం. తలస్నానం చేసిన, దువ్విన సరే జుట్టు ఊడిరావటం జరుగుతుంది. ఉల్లి వలన జుట్టుకి ఏం లాభం ఉందో ఓ సారి చూద్దాం.

2002 లో యూనివర్సిటీ అఫ్ కాలేజీ అఫ్ మెడిసిన్, ఇరాక్ వాళ్ళు ఈ ఉల్లి జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో పరిశోధనలు చేసారు.

ఉల్లిపాయల్లో సల్ఫార్, అమ్మోనియా అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకని మనం ఉల్లిపాయలు కట్ చేసినపుడు ఏ సల్ఫార్ కట్ అయి, గాల్లోకి వెళ్లి, కనులకి తగిలి కన్ల నుండి నీరు అనేది వస్తుంది.
ఉల్లిపాయలోని సల్ఫార్ జుట్టు కుదుళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన వెంట్రుక అనేది కెరాటిన్ అనే ప్రోటీన్ అంటారు. ఈ కేరాటిన్ ఉత్పత్తి చేయానికి జుట్టు కుదుళ్ళలో కెరాటినోసైట్లు ఉంటాయి. ఉల్లిపాయలోని ఈ సల్ఫార్ అనేది ఇప్పుడు చెప్పబడిన కేరాటిన్ ఉత్పత్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మన అందరి చర్మం కింద ఒక మెస్ ఉంటది దాన్ని కొలాజెన్ మెస్ అంటారు. దీనికి ఈ ఉల్లిపాయలోని సల్ఫార్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు బాగా బలంగా ఉంటాయి. ఈ విధంగా కూడ జుట్టు ఊడిపోకుండా వుండానికి వుల్లిలోని సల్ఫార్ దోహదపడుతుంది.

ఉల్లిపాయలో ముఖ్యంగా రెండు కెమికల్స్ అనేవి వున్నాయి. కాంఫిరోల్, quercetin లు ఈ రెండు ఉండటం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా అవుతాయి. అలానే బాగా రక్త ప్రసరణ జరగడానికి ఈ రెండు రసాయనాలు దోహదపడతాయి.

ఉల్లిపాయల్లో సల్ఫార్ & అమ్మోనియా అనేవి ఎక్కువగా ఉండటం వల్ల, గాల్లో వుండె బ్యాక్టీరియా & ఫంగస్ క్రిములు చెమటలో చేరి పేరుకుంటాయి. ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మరియు ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటుంది. ఎలాంటి సమస్యలు రాకుండా మరియు వచ్చిన కూడ కంప్లీట్ గా మానిపోనికి ఈ ఉల్లిపాయలు అనేవి దోహదపడతాయి.

ఉల్లిపాయలు అనేవి సైంటిఫిక్ గా కూడ పరిశోధనలు చేసి మరి నిరూపించారు. కనుక, ఉల్లిపాయలు అనేవి జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతాయి. ప్రతిరోజు మనం ఉల్లిపాయల్ని ప్రతి వంటలో ఉపయోగిస్తాము కదా! అలానే కాస్త ఉల్లిపాయలను గ్రైండ్ చేసి పెట్టుకొని, ఆ ఉల్లి పేస్ట్ ని తలకి బాగా పట్టించండి. ఆరే వరకు 20 నుండి 30 నిముషాలు అట్టిపెట్టుకోండి. తర్వాత చక్కగా తల స్నానం చేయండి. జుట్టు కుదుళ్ళు గెట్టిగా అవ్వనికి, జుట్టు ఊడిన తిరిగి రానికి & జుట్టు గ్రోత్ రానికి జుట్టుకి రక్త ప్రసరణ బాగా పెరగానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.

Leave a Comment