నొప్పిని మాయం చేసే జ్యూస్ ఇదే..

manaarogyam

Updated on:

ఏదైనా నొప్పి వస్తే మనం రక రకాల మందులను వాడతారు. వాటి వల్ల ఎటువంటి ప్రయొజనాలు ఉండవు.దాంతో మళ్ళీ ఆయుర్వేదం పై పడతారు.. అలాంటి వారికి ఒక చక్కటి జ్యూస్ వుంది.దీన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి నొప్పి అయిన మాయం చెస్తుందని ఆయుర్వెద నిపుణులు అంటున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం..

కప్పు కీర దోస ముక్కలు, అర కప్పు పైనాపిల్‌ ముక్కలు, సగం నిమ్మకాయ, ఒక కప్పు కొబ్బరినీళ్లు.. అన్నింటినీ తీసుకోవాలి. కీరదోసముక్కలు, పైనాపిల్‌ ముక్కలపై సగం నిమ్మకాయను పూర్తిగా పిండాలి. అనంతరం అందులో కొబ్బరినీళ్లను కలపాలి. తరువాత మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టుకోవాలి. దీన్ని ఒక కప్పు ఉదయం, ఒక కప్పు సాయంత్రం తీసుకోవాలి.

రోజూ ఈ విధంగా జ్యూస్‌ను తయారు చేసుకుని తాగుతుంటే శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఈ జ్యూస్‌లో అనేక పోషకాలు కూడా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు వెంటనే శక్తీ కూడా లభిస్తుంది.

Leave a Comment