ఈరోజుల్లో లావు ఉన్నా పర్వాలేదు కానీ, ఫిట్ గా ఉండాలని అనుకుంటారు. అందుకే జిమ్ ల లో ఎక్కువ సమయం గడుపుతారు.మార్కెట్లో వేల రూపాయల ఖరీదైన ప్రొటీన్ పౌడర్లను కొనే బదులుగా ఇంట్లో దొరికే వాటితో ఆ ప్రోటీన్ పౌడర్ ను తయారు చేసుకొవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
ప్రోటీన్స్ పౌడర్ కు కావలసినవి..
బాదమ్:1 కప్పు,
వాల్‌నట్: అర కప్పు,
పిస్తా: పావు కప్పు,
జీడిపప్పు: పావు కప్పు,
గుమ్మడి విత్తనాలు: 2 టేబుల్ స్పూన్లు,
పుచ్చ విత్తనాలు: 2 టేబుల్ టీస్పూన్లు,
పొద్దు తిరుగుడు విత్తనాలు: 2 టేబుల్ స్పూన్లు,
ఓట్స్: అర కప్పు,
షియా విత్తనాలు: 2 టేబుల్‌స్పూన్లు,
పాల పొడి: అర కప్పు (షుగర్ లెస్)
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ,బాదం పప్పును చిన్న మంట మీద కమ్మని వాసన వచ్చే వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో పిస్తా, వాల్‌నట్, జీడిపప్పు కలిపి వేయించి, పక్కన పెట్టుకోవాలి. గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు వేసి, సువాసన వచ్చే వరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి.అలా ఓట్స్ ను కూడా దొరగా వేయించాలి.అలా అన్నింటినీ వేయించి పక్కన బెట్టు కోవాలి. ఇప్పుడు మిక్సీ లోకి తీసుకొని మెత్తగా పొడి తయారు చేసుకోవాలి. వీటి నుంచి నూనె వెలువడకుండా పల్స్, బ్లెండ్ మోడ్‌లను మారుస్తూ ఉండాలి. ఈ పొడిని జల్లించుకుని, పాల పొడి కలుపుకుంటే ప్రొటీన్ పౌడర్ రెడీ.. టైట్ గా వుండే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఒక గ్లాస్ పాలల్లొ 2 స్పూన్లు వేసుకుంటే సరి పోతుంది.