గుమ్మడికాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదలరు..

manaarogyam

గుమ్మడికాయలను ఎక్కువ శుభకార్యాల లో వాడుతుంటారు.. ఎటువంటి నర దిష్టి తగలకుండా కాపాడుతుందని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో సాంబార్ లలొను స్వీట్స్ లలొను వాడుతుంటారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలు ఎన్నో తెలిస్తే రోజూ తినడం మొదలు పెడతారు. అవేంటో తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ ఎ, సీ, ఈ, బీటా, కెరోటిన్, ఫైబర్, రిబోఫ్లావిన్, పొటాషియం వంటి పోషకాలున్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావంతంగా ఉంటుంది.. కళ్ళకు మంచి ఆరోగ్యం. కంటి చూపు మెరుగుపరచడానికి గుమ్మడి దివ్య ఔషదం.

అధిక బరువు తో బాధపడుతున్నవారు ఈ గుమ్మడి ని తీసుకోవడం మంచిది.గుమ్మడికాయ జుట్టుకు మేలు చేస్తుంది. దీనిని తినడంతో పాటు.. హెయిర్ పేస్ట్ గా కూడా ఉపయోగించవచ్చు. గుమ్మడి కాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జుట్టుకు హెయిర్ మాస్క్ గా ఉపయోగించడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.తిన్న ఆహారం జీర్ణమయ్యెలా చేస్తుంది.

ఎముకలు బలంగా తయారవ్వడానికి సహాయపడుతుంది.. ఎముకల కు కావలసిన కాల్షియం ఎక్కువ ఉంటుంది.గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..

Leave a Comment