గుమ్మడి కాయ సూప్ తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

గుమ్మడి కాయలను దిష్టి తీయడం కోసం వాడుతుంటారు.. అలాంటి కాయలల్లో చాలా ఆరోగ్యం ఉందని నిపునులు అంటున్నారు..ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ముఖ్యంగా సూప్ లు చేసుకోవడం చాలా సులువు. వీటి వల్ల ఆరోగ్యం కూడా పెరుగుథుందని అంటున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ సూప్ తయారి విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసినవి..
పసుపు రంగు గుమ్మడికాయ – అరకేజీ,
ఉల్లిపాయ – ఒకటి,
పచ్చిమిర్చి – రెండు,
అల్లం – చిన్నముక్క,
వెల్లుల్లి రెబ్బలు – రెండు,
వేగించిన జీలకర్ర – పావుటీస్పూన్‌,
ఉప్పు – రుచికి తగినంత,
కరివేపాకు – ఒక కట్ట.

తయారీ విధానం..

ముందుగా గుమ్మడి కాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకో వాలి.కుక్కర్‌లో వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి పదినిమిషాల పాటు ఉడికించాలి. కుక్కర్‌లో ఆవిరి పోయిన తరువాత తీసి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. ఈ సూప్‌ని మళ్లీ పాన్‌లో తీసుకుని స్టవ్‌పై పెట్టి మరిగించాలి.. అందులో కరివేపాకు వేసి దించాలి..అంతే ఎంతో రుచిగా ఉండే సూప్ రెడీ.. వారానికి ఒకసారి ఇలా చేసుకొని తాగితే మంచి ఆరోగ్యం మీ సొంతం..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.