వర్షాకాలం లో ఇమ్మ్యునిటిని పెంచే పండ్లు ఇవే..

manaarogyam

చలికాలం, వర్షాకాలం అంటే జనాలు భయంతో వణికి పోతున్నారు. ఎన్నో అనారొగ్య సమస్యలను వెంట బెట్టుకుని వస్తుంది. అవి వస్తే తొందరగా తగ్గవు. ఎన్ని రకాల మందులను వాడిన, డాక్టర్ దగ్గరకు వెళ్ళినా కూడా మనల్ని వదలవు. అలాంటి వాళ్ళు వర్షాకాలంలో ఇమ్మ్యునిటి ని పెంచే పండ్లను తీసుకుంటే మంచిదని అంటున్నారు. ఎటువంటి పండ్లను తీసుకుంటే మంచి ఆరోగ్యం వుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వర్షాకాలంలో నేరేడు పండ్లు అధికంగా లభిస్తాయి. వాస్తవానికి నేరేడు పండులో క్యాలరీలలో చాలా తక్కువగా ఉంటాయి. ఇక నేరేడు పండులో ఐరన్, ఫైబర్, పొటాషియం విటమిన్లు అధికంగా లభిస్తాయి.. బరువు తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి.

దానిమ్మ..వర్షాకాల సమయంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా రోజుకు ఒక దానిమ్మ పండు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆరోగ్యకరంగా ఉండవచ్చు.

బొప్పాయి.. ఈ పండు తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు నయం అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెక్కకు మించి పొషకాలు ఇందులో ఉన్నాయి. అరొగ్యానికి, అందానికి ఇవి మంచిది.పసి పిల్లలకు రోజూ ఒక అరటిపండు తినిపిస్తే వారి శరీరానికి శక్తి అందడంతో పాటు వారికి పుష్కలంగా ఆహారం లభిస్తుంది.

Leave a Comment