ఎర్రని ద్రాక్షను తినడం వల్ల ఆసమస్యలు దూరం..

manaarogyam

మన భారత దేశంలో ద్రాక్ష పండ్లు మూడు రకాలు ఉన్నాయి.నలుపు, ఆకుపచ్చ, వంకాయ, ఎరుపు రంగులు ఉన్నాయి.. వీటిలో ఈరోజు ఎరుపు రంగు ద్రాక్ష పండు తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం..ఎర్ర ద్రాక్ష రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కెరటిన్ సమృద్ధిగా లభిస్తాయి.. బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర ద్రాక్ష బెస్ట్ ఛాయిస్.. ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని తినటం వలన త్వరగా బరువు తగ్గుతారు.

ఈ పండ్లలో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇది తీవ్రమైన కణాల వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువ మోతాదులో ఈ కాయలు తింటే గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.ద్రాక్షలను ప్రతి నిత్యం తీసుకుంటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందిస్తుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పలు అధ్యయనాలలో తేలింది. ఈ ద్రాక్ష తినడం వల్ల రక్తసరఫరా మెరుగుపడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. మధుమేహం ఉన్న వారు వీటిని తినడం చాలా మంచిది.వీటిని తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

Leave a Comment