మందుబాబులు బీరకాయను తీసుకుంటే ఎమౌతుంది?

manaarogyam

కూరగాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని  నిపుణులు అంటున్నారు.అయితే కొన్ని కాయలను కొంతమంది మాత్రమే తినాలి. అయితే మద్యం సెవించే వారికి మాత్రం డాక్టర్లు కొన్ని ఆహార పదార్థాలను తినాలని అంటున్నారు. అందులో ఒకటి బీరకాయ. వీటిలో ఎన్నో పొషకాలు ఉన్నాయి.బీరకాయ తింటే.. లివర్‌ పదిలంగా ఉన్నట్టే. ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ దెబ్బ తింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారు బీరకాయ తింటే.. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న లివర్‌ను రక్షిస్తుంది. అందుకే మందుబాబులు తీసుకునే ఆహారంలో బీరకాయ చేర్చితే.. వారి లివర్‌కి ఎలాంటి ఢోకా ఉండదు.

ఇక బీరకాయ వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.గుండె ఆరోగ్యాన్ని మెరుపరచడంలోనూ గ్రేట్‌గా సహాయపడతాయి. మధుమేహంతో బాధపడేవారికి కూడా బీరకాయ బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి. ఎందుకంటే.. బీరకాయలో ఉన్న పెప్టైడ్స్ బ్లడ్ మరియు యూరిన్ లోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. ఇక బీరకాయలో పీచు పదార్థాలతో పాటు నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది.

Leave a Comment