సగ్గుబియ్యం తో ఎంత ఆరోగ్యం ఉందో తెలుసా..?

manaarogyam

సగ్గుబియ్యం తెలియని వాళ్ళు ఉండరు..వీటితో ఎన్నో పొషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల శరీరానికి వెంటనే శక్తీ లభిస్తుంది.జ్వరం,వాంతులు,విరెచనాలు వచ్చినప్పుడు శరీరం నీరసించి శక్తిని కోల్పోతుంది. అలాంటి సమయంలో సగ్గుబియ్యంతో జావ చేసుకుని తాగితే నీరసించిన శరీరానికి శక్తిని అందించి ఉత్తేజపరుస్తుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో రొగాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

కొవ్వు పదార్థాలను తక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది ఒంట్లో వేడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు సగ్గుబియ్యాన్ని డైట్ లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చిన్న పిల్లల ఆరోగ్య మెరుగుదలకు సగ్గుబియ్యాన్ని ఇవ్వడం మంచిది..శరీరానికి కావలసిన శక్తిని అధిక మొత్తంలో అందిస్తుంది. మన ఆహారపు జీవనశైలిలో సగ్గుబియ్యాన్ని చేర్చుకోవడంతో ఆరోగ్యం పదిలం అవుతుంది. శరీర బలహీనతతో బాధపడే వారు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే చాలా మంచిది.

జీర్ణక్రియను మెరుగు పరచడానికి సగ్గుబియ్యం చక్కగా సహాయపడుతుంది.వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.అందుకే వీటిని డైట్ చేర్చుకొండి. ఇకపోతే సగ్గుబియ్యంలో తక్కువ మొత్తంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.. ఎటువంటి వాళ్ళు అయిన వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

Leave a Comment