ఆరోగ్యాన్ని పెంచే సజ్జ రొట్టె ను ఇలా చేస్తే.. సూపర్..

manaarogyam

సజ్జ రొట్టె గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. అందరికీ తెలిసినవే..ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అందుకే పాత కాలం వంటల వైపు పరుగులు పెడుతున్నారు.ముఖ్యంగా సజ్జ రొట్టె, జొన్న రొట్టె లను ఎక్కువగా తింటున్నారు..సజ్జ రొట్టె లను ఎలా తయారు చేస్తె మంచిగా వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసినవి..

సజ్జ పిండి: 2 కప్పులు,

ఉప్పు: తగినంత,

వేడి నీళ్లు: పిండికి సరిపడా,

గోధుమ పిండి: రొట్టె విరగకుండా ఉండేందుకు..

తయారి..

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పిండి వేసుకోవాలి.ఉప్పు, అరకప్పు వేడి నీళ్లు చేర్చి పిండి కలుపుకోవాలి.అవసరాన్ని బట్టి నీళ్ళను చేర్చుకోవాలి.ముద్దగా చేసిన పిండిని చిన్న ఉండలుగా విడదీసి, మళ్లీ ఆ ఉండలను విడివిడిగా మర్దించాలి. ఉండను పీట మీద ఉంచి, గోధుమ పిండి అద్దుతూ, రోటీ ఒత్తుకోవాలి.పాన్ పెట్టుకొని రొట్టె ను వేసి తడి బట్టతో అద్దుతూ కాల్చుకోవాలి.అంతే సజ్జ రొట్టె రెడీ..దీనికి పప్పు, మీగడ వేసుకొని తింటే టెస్ట్ వేరే లెవల్ అంతే.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment