నువ్వుల లడ్డు తింటే ఎన్ని ప్రయొజనాలో..

manaarogyam

Updated on:

నోటికి రుచి మాత్రమే కాదు హెల్త్ కు మంచిగా వుండే వాటిని తీసుకోవడం చాలా మంచిది.. అలాంటి వాటిలో ఒకటి నువ్వుల లడ్డు.. నువ్వులు, బెల్లం, కొబ్బరి తో చేసే ఈ లడ్డు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో చాలా మందికితెలియదు.. వాటిని ఎలా తయారు చేసుకోవాలి అనేది వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు: ఒక కప్పు నువ్వులు, పావు కప్పు పల్లీలు,
పావు కప్పు జీడిపప్పు,
సగం కప్పు ఓట్స్,
పావు కప్పు ఎండుకొబ్బరి పొడి,
రెండు కప్పులు బెల్లం తురుము,
సగం స్పూన్ యాలకుల పొడి,
పావు కప్పు నెయ్యి

తయారి విధానం..

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నువ్వులు, జీడిపప్పు, పల్లీలు, ఓట్స్ వేసి విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.ఇందులో బెల్లం తురుము, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని మిక్సీ పట్టిన నువ్వుల మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే నువ్వుల లడ్డు రెడీ.

Leave a Comment