వీటిని ఎక్కువగా తీసుకుంటే శృంగారంలో సామర్థ్యం తగ్గుతుందా?

manaarogyam

శృంగారం అనేది ఒక మంచి వ్యాయామం లాంటిది.. ఇందులో ఒకసారి పాల్గొనాలంటే శక్తీని వచ్చే ఆహరాలను తీసుకోవాలి. అలా కాదని కొన్ని తీసుకుంటే మీ భాగస్వామితో మాటలు పడాల్సి వస్తుంది. స్తామర్థ్యాన్ని తగ్గించే అహార పదర్థాలు ఏంటో  ఇప్పుడు తెలుసుకుందాం..

కూల్ డ్రింక్స్.. ఎక్కువగా తాగేవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. ఇవి సెరొటోనిన్ అనే హార్మోన్‌పై ప్రభావం చూపిస్తాయి. ఇది హ్యాప్పీ హార్మోన్‌. అంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ హార్మోన్ తగ్గితే శృంగారంపై ఆసక్తిని చూపించరు. ఆ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల కూడా శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. దీని వల్ల హార్మోన్లపై ప్రభావం పడుతుంది. యాక్టివ్‌గా ఉండలేరు. ఉత్సాహం తగ్గిపోతుంది. ఇది శృంగార జీవితంపై ప్రభావం చూపిస్తుంది. కనుక మద్యం సేవించడం మానేయాల్సి ఉంటుంది.

నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌, ఇతర ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. రక్త సరఫరా తగ్గిపోతుంది. దీని వల్ల జననావయవాలపై ప్రభావం పడుతుంది. దీంతో శృంగార సామర్థ్యం తగ్గుతుంది. కనుక ఆయా ఆహారాలను తినడం తగ్గించాలి. లేదా మానేయాలి.చక్కెర ఎక్కువగా తినడం వల్ల కూడా శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే తీపి పదార్థాలను తినడం మానేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. దీని వల్ల కూడా శృంగార శక్తి తగ్గుతుంది..ఇది గుర్తుంచుకోండి మిత్రమా..

Leave a Comment